IPL 2025 Team Of The Season: ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తాను ఎంపిక చేసిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టును ప్రకటించారు. దీనికి రోహిత్ శర్మను తన జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రోహిత్ నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను అతడు ప్రశంసించారు. ఎవరి జట్టులోనూ లేని రోహిత్ శర్మ నా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశానని వ్యాఖ్యానించాడు. ఇక, ఓపెనింగ్ రోహిత్ కి జోడిగా విరాట్ కోహ్లీని సెలక్ట్ చేశాడు. ఇక, 3, 4 స్థానాల్లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. ఐదో ప్లేస్ లో నికోలస్ పూరన్‌కు ఛాన్స్ ఇచ్చాడు.. ఆల్‌రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు అవకాశం కల్పించాడు సిద్ధూ. అలాగే, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నూర్ ఆహ్మద్‌ను ఎంపిక అతడు.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హెజిల్‌వుడ్‌లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే, ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదు.
Read Also: Meghalaya: హనీమూన్ జంట కేసులో ఘోరం.. భార్య సహా నలుగురు హంతకులు అరెస్ట్
అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించిన ఐపీఎల్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుపై నెట్టింట ట్రోలింగ్ కొనసాగుతుంది. ఓ యూజర్ ఈ విధంగా కామెంట్స్ చేశాడు.. ఇంతకీ ఈ కామెడీ ఏంటి అతను ఏ జట్టుకీ కెప్టెన్ కాదు మరి 2025 ఐపీఎల్ జట్టుకే కెప్టెన్ ఎలా అయ్యాడు? అని ప్రశ్నించాడు. కనీసం మొత్తం ఐపీఎల్ ఒకసారి చూడా అని సిద్ధూకి సూచించాడు. మరో నెటిజన్ ఇలా అన్నాడు.. హలో గురువుగారు రోహిత్ శర్మ ఐపీఎల్ టీం ఆఫ్ ది ఇయర్ లో లేడు అని వ్యాఖ్యానించాడు.
* నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపిక చేసిన ఐపీఎల్ 2025 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్.
Navjot Singh Sidhu – "Rohit Sharma Will Be My Captain For Ipl Team Of The Tournament Of 2025." pic.twitter.com/Yv5aFUl0Si
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) June 7, 2025