Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?
- ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చిన ముంబై
- భారత జట్టుకు కూడా టాప్ స్టార్లను అందించింన ముంబై
- ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Did Mumbai Indians’ Biggest Blunder: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో విజయవంతమైన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ముంబై ప్రాంచైజీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆటగాడిగా ఎదగడంలో దోహదపడుతోంది. భారత జట్టుకు కూడా టాప్ స్టార్లను అందించింది. అలాంటి ముంబై జట్టు ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా హిట్టర్ టిమ్ డేవిడ్‌ను వేలంలో వదిలేసి.. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై అతిపెద్ద తప్పిదం చేసిందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
2021 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టిమ్ డేవిడ్‌ను కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై తన తొలి మ్యాచ్ ఆడిన డేవిడ్ కేవలం 3 బంతుల్లో 1 పరుగే చేసి నిరాశపరిచాడు. ఆసీస్ తరపున దుమ్మురేపడంతో 2022లో రూ.8.4 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కిరన్ పోలార్డ్ స్థానంలో డేవిడ్‌ను భవిష్యత్తు ఫినిషర్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేసింది. పోలార్డ్ కూడా మూడు సంవత్సరాల పాటు డేవిడ్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేశాడు. ఫినిషర్ పాత్రలో ఎలా ఆడాలో, ఒత్తిడిలో ఎలా నిలబడాలో అతడికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో భవిష్యత్తులో ముంబైకి డేవిడ్ పెద్ద ఆస్తిగా మారతాడని అభిమానులు భావించారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే టిమ్ డేవిడ్ ముంబై జట్టు అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దాంతో 2025 సీజన్‌కు ముందు అతడిని వేలంలోకి విడుదల చేసింది. ఇది అందరినీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మళ్లీ ఆర్‌సీబీ డేవిడ్‌ను రూ.3 కోట్లకు దక్కించుకుంది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్‌గా కనిపించిన డేవిడ్.. ఇప్పుడు బెంగళూరు తరఫున మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. 2025లో పర్వాలేదనిపించిన డేవిడ్.. ఐపీఎల్ 2026లో రెచ్చిపోయాడు. తాజా మ్యాచ్‌లో సీఎస్‌కేపై కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అదే ప్రత్యర్థిపై ఇప్పుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడటం అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.
Also Read: RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?
ఆర్‌సీబీ తరఫున టిమ్ డేవిడ్ దూకుడు ఇన్నింగ్స్‌లు, చివరి ఓవర్లలో మ్యాచ్‌లను ముగించే సామర్థ్యం చూసి ముంబై ఇండియన్స్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘ముంబై అతడిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు భవిష్యత్తు ఆటగాడిగా ముంబై తీర్చిదిద్దితే.. ఇప్పుడు ప్రత్యర్థి జట్టుకు బలంగా మారడం ముంబైకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామం ఐపీఎల్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. సరైన సమయంలో సరైన ఆటగాడిని అట్టిపెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇదే మంచి ఉదాహరణ. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం ఇదే అని నెటిజెన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!