MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
- ఎంఎస్ ధోనీ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ
- ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్
- జట్టులోకి రావడంపై ఆలోచనలో ధోనీ
MS Dhoni Fit But No Comeback Yet: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, భారత దిగ్గజం ఎంఎస్ ధోనీ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గాయంతో ఈ సీజన్‌కు దూరంగా ఉన్న ధోనీ.. ప్రస్తుతం ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడట. అయినప్పటికీ జట్టులోకి రావడంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టీమ్ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని తానే స్వచ్ఛందంగా వెనక్కి తగ్గుతున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో ఆడడం, ఆడకపోవడం ధోనీ చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.
మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోనీ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే కొన్ని రోజలుగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నాడు. గత వారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడట. అయితే తాను జట్టులోకి వస్తే.. యువ ఆటగాడు తప్పుకోవాల్సి ఉంటుందని మహీ భావిస్తున్నాడట. అలాగే కీలక దశలో జట్టు సమతుల్యతను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో రీఎంట్రీని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో చెన్నై ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. ధోనీ నిర్ణయం పూర్తిగా అతని చేతుల్లోనే ఉందని చెబుతున్నారు.
Also Read
- Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
- IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
- Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్‌డేట్ ఇదే!
సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మిచెల్ హస్సి కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. ఎంఎస్ ధోనీ తిరిగి వస్తే కేవలం బ్యాటర్‌గా కాకుండా వికెట్‌కీపర్‌గా ఆడతాడని వెల్లడించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఉపయోగించాలన్న ఆలోచన లేదని తెలిపాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌కు ముందు ధోనీ నెట్స్‌లో వికెట్‌కీపింగ్ ప్రాక్టీస్ చేసినా.. ఇంకా మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా లేడని కోచ్ తెలిపాడు. పరుగులు తీసే సమయంలో, ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాల్సి ఉందని వివరించాడు. ప్రస్తుతం ధోనీ నెట్స్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నప్పటికీ.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మైదానంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘తల’ మళ్లీ మైదానంలో మెరవాలని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!