Dhruv Jurel: నేను భారత జట్టులో ఆడుతోంది ఆయన కోసమే: ధ్రువ్ జురెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు ముందు జురెల్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.. భావోద్వేగంతో మైదానంలో ఒకరికి సెల్యూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ… ‘నాకు అవకాశం దొరికినప్పుడల్లా మ్యాచ్‌ని ముగించాలని అనుకుంటాను. మిడిలార్డర్‌లో ఆడటం వల్ల మరింత బాధ్యత ఉంటుంది. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి నా జట్టుకు విజయాన్ని అందించాలనుకున్నా. పవర్ ప్లేలో ఇద్దరు మాత్రమే సర్కిల్ అవతల ఉంటారు. సులువుగా పరుగులు వస్తాయి. కానీ మిడిల్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లను దాటి బంతిని బౌండరీకి పంపాలి. ఇందుకు టెక్నిక్‌తో పాటు టైమింగ్ ముఖ్యం’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!
‘నేను బాగానే ఆరంబించా. అయితే నేను కొట్టిన బంతులు నేరుగా ఫీల్డర్ల వద్దకే వెళ్లాయి. ఆ సమయంలో సంజూ శాంసన్ ధైర్యం చెప్పాడు. మరీ ఎక్కువగా బాదకుండా టైమింగ్‌తో ఆడమని చెప్పాడు. ఆపై ఒకే ఓవర్‌లో 20 పరుగులు చేయడంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. నేను భారత జట్టులో ఆడుతోంది నా తండ్రి కోసమే. మా కోసం ఎన్నో కష్టాలను ఆయన ఎదుర్కొన్నారు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు నాతో పాటు లేరు. ఆ సమయంలో ఆర్మీ విధుల్లో ఉన్నారు. ఈరోజు హాఫ్ సెంచరీ చేసిన సమయంలో నాతోనే ఉండటం చాలా ఆనందంగా ఉంది. అర్ధ శతకం చేసిన తర్వాత నాన్నకే సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకున్నా’ అని ధ్రువ్ జురెల్ చెప్పాడు.
Dhruv Jurel with his family after the match. �❤️
– VIDEO OF THE DAY ….!!!! 🇮🇳 pic.twitter.com/H9rWhA0NOu
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2024
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!