T20 World Cup 2024: శుభ్‌మన్ గిల్ అవసరమా.. సెలక్టర్లు ఆసక్తి ఏంటో అర్ధం కావడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth Slams BCCI Over T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. ఫామ్‌లో లేని గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా అవసరమా? అని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి ఎంచుకుంటే బాగుండేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం రుతురాజ్ వద్దే ఉంది. 10 మ్యాచ్‌లలో 146.68 స్ట్రైక్ రేట్‌తో 509 పరుగులు చేశాడు. గిల్ 320 రన్స్ చేశాడు.
భారత ఓపెనర్లలో శుభమన్ గిల్ (320), రోహిత్ శర్మ (315), యశస్వి జైస్వాల్ (249) కంటే రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడంలో గైక్వాడ్ విఫలమయ్యాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్, యశస్వి, విరాట్ కోహ్లీ ఎంపిక కాగా.. గిల్ రిజర్వ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారిస్తున గైక్వాడ్‌ను విస్మరించిన బీసీసీఐపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోనే లేడు. అసలు అతడిని ఎందుకు ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్‌కు పూర్తి అర్హుడు’ అని అన్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: CSK vs PBKS: వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగను: హర్‌ప్రీత్
‘భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 500 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై సెంచరీ బాదాడు. అయితే శుభ్‌మన్ గిల్ పట్ల బీసీసీఐ సెలక్టర్లు ఆసక్తి చూపడానికి కారణమేంటో నాకు తెలియడం లేదు. అతడు విఫలమైనా సరే టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అవకాశం దక్కుతుంది. అంటే జట్టు ఎంపిక అంతా అభిమానంతో కూడుకున్నట్లుగా ఉంది’ అని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. రిజర్వ్ ప్లేయర్‌గా గిల్ సహా రింకు సింగ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!