Josh Hazlewood: వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అల్లాడిపోయా.. లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా!
- ఎల్ఎస్జీపై జోష్ హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శన
- 4 ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్
- లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అవార్డు అందుకున్న ఈ ఆసీస్ స్టార్ మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని నెలలు తనకు కాస్త కష్టంగా గడిచాయని, అయితే గత మ్యాచ్‌లో (రాజస్థాన్ రాయల్స్) తన రిథమ్‌ను కాస్త తిరిగి అందుకున్నానని తెలిపాడు. ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అప్పటివరకూ ఉన్నవన్నీ చెల్లాచెదురయ్యాయని చెప్పాడు. ఎల్ఎస్జీ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా అనిపించిందని, ఇప్పుడు తన బౌలింగ్ రిథమ్ మంచి స్థితిలో ఉందని హేజిల్‌వుడ్ చెప్పాడు.
‘గత కొన్ని నెలలు నాకు దీర్ఘ ప్రయాణంలా అనిపించాయి. అయితే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కొంత రిథమ్ తిరిగి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడాడు. అతడు ఉన్నంతసేపు లయ తప్పాను. ఈరోజు మాత్రం చాలా బాగుంది. నా బౌలింగ్ రిథమ్ మంచి స్థితిలో ఉంది. సరైన లెంగ్త్ బంతులు వేయాలంటే.. చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరితో ఆడుతున్నారో, ప్రత్యర్థి బ్యాటర్లు ఎవరన్నది, అలాగే పిచ్ పరిస్థితులు కూడా కీలకంగా ఉంటాయి. ఈరోజు పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొంచెం బౌన్స్ కూడా ఉంది. అందుకే సరైన లెంగ్త్‌లో బంతులు వేస్తూ ఫలితం సాధించా’ అని జోష్ హేజిల్‌వుడ్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘ఈ విజయంలో జట్టులోని ప్రతి ఒక్కరి కృషి ఉంది. ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేను టెస్ట్ బౌలర్ కావడంతో స్లోవర్ బాల్స్ వంటి వెరైటీ డెలివరీలు వేయడం కొంచెం కష్టం. అయినప్పటికీ వాటిపై పని చేస్తూనే ఉన్నాను. స్లో డెలివరీలు నా ఆయుధాల్లో భాగంగా ఉంచుకోవాలి. భువనేశ్వర్ కుమార్‌తో నేను ఎప్పటికప్పుడు చర్చిస్తుంటా. మా బౌలింగ్ యూనిట్ మొత్తం మ్యాచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని మైదానంలో చర్చలు చేస్తాం. ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తాం. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్. రసిఖ్ సలామ్ దార్ మొదటి కొన్ని మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఇటీవల మ్యాచ్‌ల్లో వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. అతడు ప్రాక్టీస్‌లో చాలా కష్టపడుతున్నాడు. అతనికి మంచి నైపుణ్యాలు ఉన్నాయి. కఠినమైన ఓవర్లు కూడా బాగా వేస్తున్నాడు. ఈ టోర్నమెంట్ అతనికి చాలా కీలకం. ఐపీఎల్ 2026లో సాధ్యమైనంత వరకు ఆడుతా. ముందున్న షెడ్యూల్ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి నేను వరుసగా మ్యాచ్‌లు ఆడగలనని ఆశిస్తున్నాను’ అని హేజిల్‌వుడ్ తెలిపాడు.
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?