Jasprit Bumrah: డాన్ బ్రాడ్మన్కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
- జస్ప్రీత్ బుమ్రాకు పీడకలగా ఐపీఎల్ 2026
- బుమ్రా పేరిట అత్యంత చెత్త రికార్డు
- టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటి బౌలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Unwanted Record: క్రికెట్లో 100 బ్యాటింగ్ సగటు అంటే అత్యున్నత ప్రమాణం. ఈ సగటు కేవలం డాన్ బ్రాడ్మన్కు మాత్రమే సాధ్యమైంది. కానీ ఒక బౌలర్ బంతితో ఈ సంఖ్యను దాటితే?.. అది అత్యంత చెత్త రికార్డు. ఈ చెత్త రికార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా పేరిట నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ గణాంకాల పరంగా బుమ్రాకు ఒక పీడకలగా మారింది. అతను 100కు పైగా బౌలింగ్ సగటును నమోదు చేసి.. ఒక టోర్నమెంట్లో తీసిన ప్రతి వికెట్కు 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన టీ20 క్రికెట్ చరిత్రలోనే మొదటి బౌలర్గా నిలిచాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 13 మ్యాచ్లు ఆడాడు. ఈ సీజన్లో మొత్తం 294 పరుగులు ఇచ్చి.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి ఎకానమీ రేట్ 8.37గా నమోదైంది. టీ20ల్లో 200 పరుగుల స్కోర్లు సాధారణమైపోయిన ఈ సీజన్లో ఇది అంత చెత్త ఎకానమీ ఏమీ కాదు. కానీ వికెట్లు తీయడంలో మాత్రం బుమ్రా పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా ఒకటి కంటే ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ యావరేజ్ 102.50కి చేరింది. అలాగే స్ట్రైక్ రేట్ 73.50గా నమోదైంది. టీ20 చరిత్రలో ఇంతలా బౌలింగ్ సగటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ రికార్డును లెక్కించడానికి కనీసం 40 ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంటే 240 బంతులు వేసిన ప్రధాన బౌలర్లకే ఇది వర్తిస్తుంది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో ముంబైకి ప్రధాన బౌలర్గా అన్ని మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ.. వికెట్లు మాత్రం పెద్దగా పడగొట్టలేకపోయాడు. ఇది అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే బుమ్రా చెత్త గణాంకాల వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయి బౌలర్గా పేరున్న బుమ్రాపై ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు పెద్దగా రిస్క్ తీసుకోలేదు. అతడి యార్కర్లు, వేగవంతమైన బంతులను ఎదుర్కొనే బదులు.. జాగ్రత్తగా ఆడి సింగిల్స్ తీసుకుంటూ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో బుమ్రా పరుగులు నియంత్రించినప్పటికీ.. వికెట్లు మాత్రం దక్కలేదు.
మరోవైపు ముంబై ఇండియన్స్ ఇతర బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతో.. అన్ని జట్ల బ్యాటర్లు బుమ్రా బౌలింగ్లో ఒత్తిడి లేకుండా ఆడగలిగారు. బుమ్రా నాలుగు ఓవర్లలో 25 నుంచి 30 పరుగుల మధ్య ఇచ్చినా.. వికెట్లు దక్కకపోవడంతో సగటు అమాంతం పెరిగిపోయింది. గణాంకాల పరంగా ఇది చెత్త రికార్డుగా కనిపించినప్పటికీ.. బుమ్రా ఎక్కువ మ్యాచ్ల్లో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నాడనే విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. వికెట్లు తీయకపోయినా.. బూమ్ బూమ్ కంట్రోల్ మాత్రం చాలా మ్యాచ్ల్లో స్పష్టంగా కనిపించింది.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..