ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం ఏ బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ల లిస్ట్ ఓసారి చూద్దాం.
ఐపీఎల్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఏకంగా 8 సిక్సర్లు బాది.. తన దూకుడు బ్యాటింగ్‌ను ప్రపంచానికి చూపించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని తలా 6 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ మాజీ స్టార్ కీరన్ పోలార్డ్ 5 సిక్సర్లు బాదగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్, కోల్‌కతా స్టార్ ఆండ్రీ రస్సెల్ తలా 4 సిక్సర్లు కొట్టారు. అలాగే దినేష్ కార్తిక్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్ తలా 3 సిక్సర్లు బాదారు.
ఈ జాబితాలో తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా చేరడం విశేషం. అతడు బూమ్ బూమ్ బుమ్రా బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదాడు. 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్‌ను టార్గెట్ చేసి సిక్సర్లు కొట్టడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం అంటే బ్యాటర్‌కు నైపుణ్యం, ధైర్యం రెండూ ఉండాలి. ఈ రెండు యువ సంచనలం సూర్యవంశీలో మెండుగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ అంతర్జాతీయ క్రికెటర్లు కాగా.. వైభవ్ మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. వైభవ్ తన సిక్సుల రికార్డును మెరుగుపర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
