సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016 లో ఐపీఎల్ టైటిల్ ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ ఏడాది కరోనా సమయంలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు వార్నర్. దాంతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్ గా తొలగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో వార్నర్ లేకపోవడం హైదరాబాద్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దాంతో వార్నర్ ను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి డేవిడ్ చెప్పిన సమాధానాలు చూస్తుంటే వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ కు వార్నర్ గుడ్ బై చెప్పనున్నాడు అనే అనుమానం కలుగుతుంది. అయితే నిన్న మ్యాచ్ సమయంలో వార్నర్ ను ” మీరు స్టేడియం లో ఉన్నారా.. మేము మిమల్ని చూడలేదు” అని ప్రశ్నించగా.. దానికి వార్నర్ సమాధానం ఇస్తూ… ఇకపై నన్ను చూడలేకపోవచ్చు.. కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండు” అని కోరాడు. అయితే వచ్చే సీజన్ కు వార్నర్ వేలంలోకి హైదరాబాద్ వదిలేయనుంది అని సమాచారం.