Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై చెలరేగిపోయాడు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్, కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల రికార్డు) చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయినప్పటికీ.. ఈ ఇన్నింగ్స్‌తో అతను పలు చారిత్రాత్మక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్‌ను అవుట్ చేయడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ప్రఫుల్ హింగె సరికొత్త రికార్డుల పరంపరకు బ్రేక్ వేశాడు. వీరిద్దరి మధ్య ఐపీఎల్ 2026 సీజన్ మొత్తంలో ఒక ఆసక్తికరమైన రైవల్రీ నడిచింది. లీగ్ దశలో హైదరాబాద్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ప్రఫుల్ హింగె తన ఐపీఎల్ అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీని మొదటి బంతికే (గోల్డెన్ డక్) అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత జైపూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో వైభవ్ కక్ష తీర్చుకుంటూ ప్రఫుల్ హింగె వేసిన మొదటి ఓవర్లోనే వరుసగా 4 సిక్సర్లు బాది, కేవలం 36 బంతుల్లోనే 103 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు చావో రేవో లాంటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో 334.48 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ వైపు దూసుకెళ్తున్న వైభవ్‌ను మళ్లీ ప్రఫుల్ హింగె అవుట్ చేసి హైదరాబాద్‌కు భారీ ఉపశమనాన్ని ఇచ్చాడు. స్మరణ్ రవిచంద్రన్ పట్టిన అద్భుత క్యాచ్‌తో వైభవ్ ఇన్నింగ్స్ 97 పరుగుల వద్ద ముగిసింది.
Also Read
- SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
- SRH Vs RR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
- Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
సెంచరీ మిస్సయినా, ఐపీఎల్ నాకౌట్/ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో 2023లో ముంబై ఇండియన్స్‌పై శుభ్‌మన్ గిల్ కొట్టిన 10 సిక్సర్లు, అలాగే 2026లో గుజరాత్ టైటాన్స్‌పై రజత్ పటీదార్ కొట్టిన 9 సిక్సర్ల రికార్డులను అధిగమించి, ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 12 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఇన్నింగ్స్‌లో సాధించిన సిక్సర్లతో ఈ సీజన్లో వైభవ్ మొత్తం సిక్సర్ల సంఖ్య 60కి చేరింది. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (2012లో 59 సిక్సర్లు) ఆల్‌టైమ్ రికార్డును కూడా ఈ 15 ఏళ్ల కుర్రాడు బద్దలు కొట్టడం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
-
Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
-
మందు అనుకుని ఎయిర్‌పాడ్స్‌ను మింగేసిన మహిళ.! ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవ్వాల్సిందే
-
Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్‌గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
-
SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!