Rajat Patidar: “చూస్తుంటే కొట్టేలా ఉన్నాడే”.. వైభవ్ మెడ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar: ఆర్సీబీ మ్యాచ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్య వంశీ దుమ్మురేపాడు. బౌలర్లుకు చుక్కలు చూయించాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఆటగాడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు అభిమానులు, మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌తో సరదాగా కనిపించారు. వైభవ్ ఆర్‌సీబీ ఆటగాడు జితేష్ శర్మతో మాట్లాడుతుండగా.. పాటిదార్ అతని వద్దకు వచ్చి సరదాగా మెడ పట్టుకుని వంపాడు. ఈ ఘటనతో ఇద్దరు క్రికెటర్లు నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియో కింద క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. “చూస్తుంటే వైభవ్‌ను కొట్టేలా ఉన్నాడు” అంటూ ఓ అభిమాని సరదాగా కామెంట్ చేశాడు.
READ MORE: Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇదిలా ఉండగా.. మ్యాచ్ ముగిసిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. 200కు పైగా స్కోరు చేసినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు తమ జట్టు ఓడిపోయిందని అంగీకరించాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రభావమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించిందని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్‌ను వైభవ్ సూర్యవంశీ శక్తివంతమైన దాడితో ప్రారంభించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌ను తన ధైర్యమైన షాట్లతో సులభంగా చిన్నాభిన్నం చేశాడు. చివరకు క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో మ్యాచ్‌పై రాజస్థాన్ రాయల్స్ పూర్తి పట్టు సాధించింది. 134 పరుగులకే నాలుగు వికెట్లు కొల్పోయి కాసేపు తడబడినప్పటికీ, సూర్యవంశీ వేసిన పునాది వల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్‌సీబీపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Rajat Patidar with Vaibhav Sooryavanshi.#RCBvsRR । #ViratKohli । #RRvsRCB । #IPL2026 । #TATAIPL । #RoyalChallengersBangalore । #RajasthanRoyals । #vaibhavsooryavanshi । #PlayBold । pic.twitter.com/OZ5SR7bpDN
— Infinite Info (@infiniteInfos) April 11, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!