Vaibhav Sooryavanshi: గేల్ రికార్డును తుడిచేసి.. ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన వైభవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. శుక్రవారం (మే 29) న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ ఈ మైలురాయిని అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్లో 15 ఇన్నింగ్స్‌లలో ఎవరూ ఊహించని విధంగా 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసిన వైభవ్, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒకే టీ20 టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఈ ‘యూనివర్స్ బేబీ బాస్’.. ఇప్పుడు ఐపీఎల్లో అత్యంత వేగంగా, అతి పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు కేవలం 68 పరుగుల దూరంలో ఉన్నాడు.
2025లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 932 పరుగులు సాధించాడు. ఈ 932 పరుగుల కోసం అతను ఎదుర్కొన్నది కేవలం 402 బంతులు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ స్టార్ ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానంలో టిమ్ డేవిడ్ (560 బంతులు) ఉన్నాడు. వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 142 బంతుల లీడ్ ఉంది. అతని ప్రస్తుత ఫామ్, స్ట్రైక్ రేట్ చూస్తుంటే.. రస్సెల్ రికార్డు కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఏజ్ విషయానికి వస్తే.. ఐపీఎల్లో అతి పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేరిట ఉంది. పంత్ 20 ఏళ్ల 281 రోజుల వయసులో ఈ మైలురాయిని చేరుకోగా.. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించబోతున్నాడు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో హైదరాబాద్‌పై సెంచరీ చేసినప్పుడు.. అత్యంత చిన్న వయసులోనే ఓవరాల్ టీ20ల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ పంత్ రికార్డును తుడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో వైభవ్ మరోసారి చెలరేగితే రికార్డుల వేట సాకారం కానుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!