SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2026 ప్రయాణం అభిమానులకు కాస్త నిరాశతోనే ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోవడంతో హైదరాబాద్ టోర్నీ నుంచి తప్పుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచినప్పటికీ, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. టోర్నీలో జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ, టైటిల్ గెలవలేకపోవడం అభిమానులను బాధించింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సీజన్ కోసం జట్టును మరింత బలంగా మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ ధర పెట్టి కొన్నా, ఆశించిన స్థాయిలో రాణించని కొందరు ఆటగాళ్లను, అలాగే గాయాల వల్ల జట్టుకు దూరం అయిన వారిని వదిలేయాలని చూస్తోంది. దీనివల్ల వేలంలో కొత్త ఆటగాళ్లను కొనడానికి నిధులు దొరుకుతాయి.
Also Read
- Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
- ‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
ముఖ్యంగా రూ. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి, 15 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు తీసుకున్నా, ఈ సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. యువ బౌలర్లు రాణించడంతో ఇతడిని వచ్చే ఏడాది దూరం పెట్టే అవకాశం ఉంది.
వీరితో పాటు కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసిన జయదేవ్ ఉనద్కత్, గాయాల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన బ్రైడన్ కార్స్, శివమ్ మావిలను కూడా జట్టు వదులుకునేలా కనిపిస్తోంది. కార్స్ స్థానంలో వచ్చిన డేవిడ్ పేన్ కూడా గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. గత సీజన్లో బాగా ఆడినా, ఈసారి ఒక్క అవకాశం కూడా రాని శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ కూడా జట్టును వీడే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే సీజన్లో సరికొత్త సన్‌రైజర్స్ జట్టును చూడబోతున్నాం.
తాజావార్తలు
-
SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
-
Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
-
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!