అబుదాబి వేదికగా మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం జరిగింది. 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకుని.. ఐపీఎల్ 2026 కోసం పూర్తిస్థాయి జట్లను సిద్ధం చేసుకున్నాయి. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 9 మంది ప్లేయర్స్‌ను వేలంలో తీసుకుంది. ఈ తొమ్మిది మందిలో బాగా తెల్సిన ప్లేయర్స్ ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఓ మాన్‌స్టర్ ఉన్నాడు. అతడే ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ ‘లియామ్ లివింగ్‌స్టోన్’. మినీ…
లక్కంటే ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌దే అని చెప్పాలి. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అతడిని దక్కించుకుంది. ముందు అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు రెండవ రౌండ్‌లో అదృష్టం వరించింది. అతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. అయితే లక్నో వద్ద సరైన పర్స్ వాల్యూ లేకపోడంతో వెనకడుగు వేసింది. దాంతో లివింగ్‌స్టోన్ ఎస్‌ఆర్‌హెచ్…