Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Vaping Controversy: ఐపీఎల్ 2026 సీజన్లో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా, రాజస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో పరాగ్ ‘వేపింగ్’ (Vaping) చేస్తూ కెమెరాకు చిక్కాడు. అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇప్పుడు ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేవలం 16 బంతుల్లో 29 పరుగులు చేసి, కీలక సమయంలో అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న పరాగ్.. అక్కడ వేప్ ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్స్‌లో పొగాకు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడటంపై కఠిన నిషేధం ఉంది. బీసీసీఐ (BCCI) క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం పరాగ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. సంజూ శామ్సన్ను చెన్నై దక్కించుకోవడంతో ఈ సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల పరాగ్, ఇప్పటికే తన బ్యాటింగ్ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 81 పరుగులే చేయడం గమనార్హం. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ సైతం నిబంధనల ఉల్లంఘన కారణంగా చిక్కుల్లో పడ్డారు. ఏప్రిల్ 10న గువహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు గాను అతనికి రూ. 1 లక్ష జరిమానా విధించారు. బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) ఇప్పటికే అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసి, 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తరహా వరుస వివాదాలు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నాయి. మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, వారికి ఈ సీజన్లో మొదటి ఓటమిని రుచి చూపినప్పటికీ.. వెలుపల జరుగుతున్న ఈ పరిణామాలు జట్టు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హోదాలో ఉన్న వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Riyan parag smoking vape in dressing room .. is this legal @IPL pic.twitter.com/91yqwH105e
— Prxtham.Edits18 (@Prxtham_Edits18) April 28, 2026
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!