RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB: చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మ్యాచ్ గెలిచినప్పటికీ.. ఐపీఎల్‌లో ఓ అవాంఛనీయ రికార్డును ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సెంచరీలు సమర్పించుకున్న జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్‌సీబీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఏకంగా 15 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ (14) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి ఐపీఎల్‌లో మూడో సెంచరీ కాగా, 2026 సీజన్‌లో ఇదే మొదటిది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఇదే క్రమంలో సుదర్శన్ మరో అద్భుత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (47 ఇన్నింగ్స్‌ల్లో) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచి, క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ఫిల్ సాల్ట్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అటు గుజరాత్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అరంగేట్రం చేయగా, మానవ్ సుతార్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 205/5 పరుగులు చేసింది. సుదర్శన్ సెంచరీతో చెలరేగినప్పటికీ, ఆర్‌సీబీ బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను కొంతవరకు నియంత్రించగలిగారు.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!