Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అనేది కేవలం గణాంకాలు, స్కోర్లకే పరిమితం కాదు.. సరైన గురువుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడం కూడా ఇందులో కీలకం. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ విషయంలో ఇదే జరుగుతోంది. భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నీడలో ప్రభ్‌సిమ్రన్ తన ఆటను మెరుగుపరుచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
గురువు కాదు.. ఒక అన్నలా..
సాధారణంగా కోచ్, శిష్యుడి మధ్య ఉండే సంబంధం కంటే, వీరిద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని ప్రభ్‌సిమ్రన్ చెబుతాడు. యువరాజ్ తనకు ఒక అన్నలా అండగా ఉంటారని, అర్ధరాత్రి 3 లేదా 4 గంటలకు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి సలహాలు ఇస్తారని ప్రభ్‌సిమ్రన్ పేర్కొన్నాడు. మొహాలీ లేదా గుర్గావ్లో శిక్షణ కోసం యువరాజ్ స్వయంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ, యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. ఇప్పటికే శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి వారు యువరాజ్ శిక్షణలో రాటుదేలగా.. ఇప్పుడు ప్రభ్‌సిమ్రన్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read: Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
ఐపీఎల్ 2026లో ప్రభ్‌సిమ్రన్ జోరు
2019లో ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, 2025 సీజన్ ప్రభ్‌సిమ్రన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సీజన్లో 549 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో 8వ స్థానంలో నిలిచాడు. అతని ప్రతిభను గుర్తించిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రూ.4 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం IPL 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తు్న్నాడు.
యువరాజ్ సింగ్ వంటి మెంటార్ మద్దతు ఉండటంతో.. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, త్వరలో జరగబోయే ఐర్లాండ్ సిరీస్ ద్వారా భారత జట్టు (Team India) లో చోటు సంపాదించాలని ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుదలతో ఉన్నాడు. యువరాజ్ శిష్యరికం ప్రభ్‌సిమ్రన్ కెరీర్‌కు కచ్చితంగా ఒక గొప్ప మలుపు కానుంది.
తాజావార్తలు
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?