Pat Cummins: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కమిన్స్ తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. వెన్నునొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్, ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన టెస్ట్‌ల్లో గాయం పూర్తిగా నయమైందని తేలింది. దీంతో పునరాగమనానికి లైన్ క్లియర్ అయ్యింది. 32 ఏళ్ల ఈ ఆసీస్ దిగ్గజం సోషల్ మీడియా ద్వారా తాను వెంటనే భారత్‌కు బయలుదేరుతున్నట్లు హింట్ ఇవ్వడంతో ఆరెంజ్ ఆర్మీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో కమిన్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
READ MORE: Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ ఏడాది కమిన్స్‌కు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత అతను మళ్ళీ మైదానంలోకి దిగలేదు. దురదృష్టవశాత్తూ ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు కూడా అతను దూరం కావాల్సి వచ్చింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం విశేషం. ఇక ఐపీఎల్‌లో కమిన్స్ అందుబాటులో లేని సమయంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిపించిన ఇషాన్, పాయింట్ల పట్టికలో జట్టును నాలుగో స్థానంలో ఉంచాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ 0.576గా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకోసం ఎంతో మంది అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎట్టకేలకు రెగ్యూలర్ కెప్టెన్ ఎంట్రీతో ఎస్‌ఆర్‌ఎచ్‌లో ఊపు పెరగనుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!