KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 25న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఒక అద్భుతానికి వేదికైంది. విమర్శలన్నింటినీ పక్కన పెట్టి, ఆధునిక టీ20 క్రికెట్ వేగానికి అనుగుణంగా తనను తాను మలచుకున్న కె.ఎల్. రాహుల్, పంజాబ్ కింగ్స్‌పై కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయారు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులతో అజేయంగా నిలిచి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిని సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ విధ్వంసం మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 150 పరుగుల మైలురాయిని దాటిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. క్రిస్ గేల్ (175), బ్రెండన్ మెకల్లమ్ (158) తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (152) సాధించిన మూడవ బ్యాటర్‌గా నిలిచారు.
తొలి ఇన్నింగ్స్ ముగిశాక రాహుల్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పవర్ ప్లేలో ఆడే ఓపెనర్స్ ఎంతో ఉత్సాహంగా, హుషారుగా ఉండాలి.. ప్రతీ బాల్ ను బౌండరీకి తరలించాలనే ఆలోచనతోనే ఉండాలి.. మొదటి బంతి నుండే అటాక్ చేయాలి. నితీష్ రాణా అద్భుతమైన నాక్ ఆడాడు. సరైన క్రికెట్ షాట్లతో పవర్ ప్లేలో పరుగులు రాబట్టినప్పుడు బౌలింగ్ టీమ్ మరింత ఒత్తిడికి లోనవుతుంది” అని రాహుల్ వివరించారు. కానీ మ్యాచ్ ఓడిపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తను చేసిన కృషికి ప్రతిఫలంగా జట్టుకు 264 పరుగుల కొండంత స్కోరును అందించినప్పుడు, రాహుల్ గెలుపు ధీమాతో ఉన్నాడు. కానీ, విధి మరోలా వెక్కిరించింది. పంజాబ్ ఓపెనర్లు సృష్టించిన రికార్డు పవర్ ప్లే విధ్వంసం ముందు రాహుల్ కష్టం నీటి మూటలా మారిపోయింది. 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలిచింది.
ఒక ఆటగాడిగా తాను అసాధారణ ప్రదర్శన ఇచ్చి, రికార్డులన్నీ తిరగరాసినా.. జట్టు ఓడిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. రికార్డులు గణాంకాల్లో నిలిచిపోతాయి, కానీ ఆ క్షణంలో కలిగిన ఓటమి వేదన రాహుల్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆరెంజ్ క్యాప్ తీసుకునే సమయంలో ఎవరైనా సంతోషంగా ఉంటారు.. కానీ రాహుల్ ముఖంలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. అంతటి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా జట్టు గెలవకపోవడం అనేది అతని కెరీర్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మైదానంలో రాహుల్ బ్యాట్ గెలిచింది కానీ, అదృష్టం మాత్రం వెక్కిరించింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!