Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌కు టెస్ట్, వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. 2025లో ఆడిన 15 టీ20ల్లో గిల్ కేవలం 24.25 సగటుతో 291 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు గిల్ మాట్లాడుతూ.. “భారత టీ20 జట్టుకు ఎంపికైతే ఆడటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. క్రికెట్లో ఎవరూ సంపూర్ణంగా పర్ఫెక్ట్ కాలేరు, కానీ ఆ పర్ఫెక్షన్ కోసం నిరంతరం శ్రమించవచ్చు. నేను మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదగడానికి కష్టపడుతున్నాను” అని తెలిపాడు. టీ20 జట్టు ప్రణాళికల్లో ప్రస్తుతం లేకపోయినప్పటికీ, తన సన్నద్ధతపై అది ఎలాంటి ప్రభావం చూపలేదని, మానసికంగా తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ సీజన్లో గిల్ ఇప్పటివరకు 722 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అయితే, భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం గిల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో 776 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. వైభవ్‌పై గిల్ ప్రశంసలు కురిపిస్తూ, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. భవిష్యత్తులో ప్రత్యర్థి బౌలర్లకు అతడు నరకం చూపించడం ఖాయమన్నాడు. అలాగే గుజరాత్లో తన ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ (710 పరుగులు) స్థిరత్వాన్ని కూడా గిల్ అభినందించాడు. మైదానం లోపల, బయట సుదర్శన్ పాటించే క్రమశిక్షణే అతడి విజయ రహస్యమని గిల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!