‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలపై భారత మాజీ బ్యాటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులతో మరోసారి చెలరేగాడు. అయితే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో అదరగొట్టడంతో ఈ భారీ స్కోరు కూడా సరిపోలేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరిగి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 35 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంజ్రేకర్ తప్పుబట్టారు. గాయపడిన జడేజాను మళ్లీ బ్యాటింగ్‌కు పంపడం, అలాగే విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరా కంటే ముందు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ప్రమోట్ చేయడం పెద్ద పొరపాటని విమర్శించారు. 8వ స్థానంలో బరిలోకి దిగిన ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. “రిటైర్డ్ హర్ట్ అయిన జడేజాను మళ్లీ లోపలికి పంపడం, ఫెరీరా కంటే ముందు ఆర్చర్‌ను బ్యాటింగ్‌కు దించడం రాజస్థాన్ చేసిన అత్యంత చెత్త నిర్ణయాలు. వీటిని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను.. మీరు బుద్దిలేకుండా ఆ నిర్ణయాలు తీసుకున్నారు” అని మంజ్రేకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
Still can’t get over the poor call by RR to put Jadeja back in after he had retired hurt & then have Joffra Archer come before Donovan Ferreira.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 30, 2026
మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తాము చేసిన స్కోరు డిఫెండ్ చేసుకోవడానికి సరిపోయేదేనని, అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించిందని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ క్వాలిఫయర్ వరకు రావడం పెద్ద సానుకూలాంశమని, భవిష్యత్తులో ఈ అనుభవంతో వారు మరింత మెరుగవుతారని పరాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!