IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ కీలకమైన ప్లేఆఫ్స్ దశ మ్యాచ్‌లకు ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ (District by Zomato) సంస్థ అధికారిక టిక్కెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే (మే 18, సోమవారం నాటికి) కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మాత్రమే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
రుపే కార్డ్ హోల్డర్లకు ముందస్తు అవకాశం..
మ్యాచ్యులను స్టేడియంలో చూడాలనుకునే అభిమానుల కోసం బీసీసీఐ ప్రత్యేక విండోలను ఏర్పాటు చేసింది. ఎప్పటిలాగే రుపే క్రెడిట్ కార్డ్ కలిగిన వినియోగదారులకు సాధారణ ప్రజల కంటే 24 గంటల ముందే టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రత్యేక అర్హత లభిస్తుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్: ఈ రెండు మ్యాచ్‌ల ముందస్తు బుకింగ్స్ మే 20, రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో క్వాలిఫైయర్-1 జరగనుండగా.. మే 27న న్యూ చండీగఢ్‌లోని కొత్త పీసీఏ (PCA) స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
క్వాలిఫైయర్ 2, ఫైనల్: ఈ మ్యాచ్‌ల కోసం రుపే కార్డ్ హోల్డర్ల ప్రత్యేక బుకింగ్ విండో మే 22, రాత్రి 7 గంటలకు ఓపెన్ అవుతుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్ మే 29న న్యూ చండీగఢ్‌లో, అలాగే ఐపీఎల్ 2026 ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
సాధారణ వినియోగదారుల టిక్కెట్లు..
ఎటువంటి ప్రత్యేక క్రెడిట్ కార్డులు లేని సాధారణ క్రికెట్ అభిమానుల కోసం కూడా బీసీసీఐ సమయాలను ఖరారు చేసింది. క్వాలిఫైయర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌ల సాధారణ విక్రయాలు మే 21, రాత్రి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. క్వాలిఫైయర్ 2 , గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ల సాధారణ టిక్కెట్లు మే 23, రాత్రి 8 గంటల నుండి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో అందరికీ అందుబాటులో ఉంచబడతాయి. మొత్తంగా ధర్మశాల, న్యూ చండీగఢ్, అహ్మదాబాద్ నగరాలు ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండటంతో క్రికెట్ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?