Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15 పరుగులు అదనంగా ఇచ్చేసామని భావిస్తున్నాను. అయినప్పటికీ 206 పరుగుల లక్ష్యం ఈ వికెట్‌పై ఛేదించదగినదే. కానీ, మా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే పవర్‌ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం మా కొంపముంచింది. అక్కడి నుంచి మ్యాచ్‌ను తిరిగి మా వైపు తిప్పడం ఎప్పుడూ కష్టంతో కూడుకున్న పనే. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పిచ్ చాలా బాగుంది, బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోంది. సరైన షాట్లు ఆడి క్రీజులో నిలబడి ఉంటే బాగుండేది” అని తెలిపాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
డెత్ ఓవర్ల బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. “చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే. అయితే చివరి 5 ఓవర్లలో 1 లేదా 2 బౌండరీలను ఆపగలిగితే ప్రత్యర్థి స్కోరును కట్టడి చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు మేము ఆ పని చేయలేకపోయాము. రాజస్థాన్ జట్టు చివరి 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు రాబట్టడం మా ఓటమికి ప్రధాన కారణం” అని పాండ్యా వివరించాడు. ఈ సీజన్ మాకు అస్సలు కలిసి రాలేదు.. వచ్చే ఏడాది చూసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (0), నమన్ ధీర్ (6) రూపంలో పవర్‌ప్లేలోనే ఆర్చర్ ముంబయికి కోలుకోలేని దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (60) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, హార్దిక్ పాండ్యా (34) అవుట్ కావడంతో ముంబయి ఇన్నింగ్స్ 175 పరుగులకే పరిమితమైంది. ఒత్తిడిని తట్టుకోవడంలో ముంబయి ఆటగాళ్లు విఫలమయ్యారని క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!