KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు వస్తున్న వేళ, కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
ఈ మ్యాచ్ కేకేఆర్‌కు చావో రేవో లాంటిది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా భారీ తేడాతో గెలవాల్సిందే. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న రహానే సేన.. అదే జోరును ఇక్కడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పిచ్ కండిషన్స్ దృష్ట్యా చేజింగ్ సులభం అవుతుందనే నమ్మకంతో రహానే బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. వారు గత మ్యాచ్‌లో ఆడిన సేమ్ టీమ్‌తోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ముంబై కెప్టెన్ల రికార్డు..
మరోవైపు, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌లో కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పట్టికలో మెరుగైన స్థానం కోసం ఆడుతోంది. గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో మాట్లాడుతూ.. తాము కూడా మొదట బౌలింగ్ చేయడానికే ఇష్టపడేవాళ్లమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందని, చివరి మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి తల ఎత్తుకుని టోర్నీ ముగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఒక విచిత్రమైన రికార్డును మూటగట్టుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు (సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా) జట్టును నడిపించారు. ఐపీఎల్ చరిత్రలో గతంలో 2013లో పూణే వారియర్స్ ఇండియా జట్టు మాత్రమే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ముంబై జట్టులో నేడు హార్దిక్ పాండ్యాతో పాటు అల్లా గజన్ఫర్ జట్టులోకి వచ్చారు. ఈ పోరులో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను ముంబై దెబ్బతీస్తుందా? లేక రహానే సేన విజయం సాధిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!