Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా RCBతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్, ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో క్లాసెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 600 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతనికి కేవలం 45 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే కేవలం 24 బంతుల్లోనే 51 పరుగులు బాదిన క్లాసెన్ ఆ ఘనతను సునాయాసంగా అందుకున్నాడు.
ఈ ప్రదర్శనతో ఒక టీ20 టోర్నమెంట్ లేదా సిరీస్‌లో నాలుగో స్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 600కి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా క్లాసెన్ చరిత్ర సృష్టించాడు. దీంతో రిషబ్ పంత్ పేరిట ఉన్న కీలక రికార్డు కూడా చెరిగిపోయింది. ఇంతకుముందు ఈ రికార్డు పంత్ పేరిట ఉండేది. అతను ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగో స్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 579 పరుగులు సాధించాడు. ఇప్పుడు క్లాసెన్ ఆ మార్క్‌ను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్‌లోని 14 లీగ్ మ్యాచ్‌లన్నింటిలోనూ రెండంకెల స్కోరు చేసిన తొలి విదేశీ ఆటగాడిగానూ క్లాసెన్ నిలిచాడు. అతని నిలకడైన బ్యాటింగ్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లాసెన్‌ను భారీగా అంటే.. రూ.23 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతను తన ప్రదర్శనతో జట్టు నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టాడు. ఇప్పటివరకు ఆరు అర్ధశతకాలు సాధించిన క్లాసెన్, ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక, RCBపై తన ఇన్నింగ్స్‌లో క్లాసెన్ రెండు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఇషాన్ కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ అప్పటికే క్లాసెన్ తన దూకుడు ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ను భారీ స్కోరు దిశగా నడిపించాడు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..