Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Hardik Pandya Reaction After Mumbai Indians Heavy Defeat Vs Csk Ipl 2026

Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్

Published Date :April 24, 2026 , 9:08 am
By RAMAKRISHNA KENCHE
Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hardik Pandya: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియాన్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటములతో విసిగిపోయిన పాండ్యా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, ఇదే తమ పతనానికి కారణమని అభిప్రాయపడ్డాడు. లక్ష్య ఛేదనలో ఆరంభం బాగుంటేనే ఫలితం అనుకూలంగా వచ్చేదని, కానీ ఈ మ్యాచ్‌లో అది సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పిచ్ గురించి వివరిస్తూ.. “పిచ్‌లో మార్పు వచ్చిందని నేను సాకులు చెప్పను. ముంబై బ్యాటర్లలాగే వాళ్లూ అదే ట్రాక్‌పై బ్యాటింగ్ చేశారు. వాళ్లు 207 పరుగులు చేశారంటే అది వారి ప్రతిభ. పిచ్ ఒకేలా ఉన్నప్పుడు మేము కూడా బాగా బ్యాటింగ్ చేయాల్సింది” అని హార్దిక్ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో బంతి కాస్త గ్రిప్ అవుతున్న మాట వాస్తవమేనని, తమ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు. అయితే సంజూ శామ్సన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని, ఇతర బ్యాటర్లు సైతం అతనికి సహకరించడంతో చెన్నై ఒక భారీ స్కోరును సాధించగలిగిందని కొనియాడాడు. ముందున్న మ్యాచుల కోసం జట్టులో మార్పులు ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “జట్టు కూర్పుపై ఖచ్చితంగా చర్చ జరుపుతాం. మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఏం చేయాలో కూర్చుని ఆలోచిస్తాం. మాకు ఇంకా సమయం ఉంది, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఏం చేయగలమో దానిపై దృష్టి సారిస్తాం” అని హార్దిక్ స్పష్టం చేశాడు.

Also Read

  • Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!
  • MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
  • MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న వాంఖడే స్టేడియంలో చెన్నై 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్ బరిలోకి దిగిన ముంబై పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైంది. స్పిన్నర్లు అకీల్‌ హొసీన్, నూర్‌ అహ్మద్‌ల ధాటికి విలవిలలాడిన ముంబై సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక మొదట చెన్నై ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లు చేతులెత్తేసినా.. సంజు శామ్సన్‌ మాత్రం అద్భుతంగా రాణించాడు. రెండో శతకంతో జట్టుకు మెరుగైన స్కోరునందించాడు. దీంతో గత మ్యాచ్‌లో గుజరాత్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. ఈ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • CSK vs MI
  • Hardik Pandya
  • Hardik Reaction
  • IPL 2026

తాజావార్తలు

  • Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్

  • Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!

  • IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!

  • NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!

  • Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions