Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Csk Vs Dc Controversy Tristan Stubbs Gloves Umpire Row Ipl 2026

CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

Published Date :April 12, 2026 , 9:26 am
By RAMAKRISHNA KENCHE
CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CSK vs DC controversy: నిన్న(శనివారం) చెన్నై సూపర్ కింగ్స్(CSK), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ మధ్యలో భారీ వివాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. 213 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బరిలోకి దిగింది. ఈ సమయంలో జట్టు కోచ్ హేమంగ్ బదానీ, బ్యాటర్లు నితీష్ రాణా, కరుణ్ నాయర్ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతలో కామెంటరీ బాధ్యతలు చేపట్టిన సీఎస్‌కే మాజీ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఈ అంశంపై వివరణ ఇచ్చాడు. ఢిల్లీ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను గ్లౌజులు మార్చుకోవడానికి అనుమతించకపోవడంతో డీసీ శిబిరం అసంతృప్తికి గురైందని వెల్లడించాడు.

READ MORE: Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

అసలు ఏం జరిగిందంటే..?
19వ ఓవర్‌లో క్రీజులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ తన గ్లౌవ్స్ మార్చుకోవాలని భావించాడు. గ్లౌవ్స్ తీసుకొచ్చేందుకు సైగ చేశాడు. చెమటతో తడిసిన గ్లౌజుల వల్ల అతని పట్టు దెబ్బతినడంతో అసౌకర్యంగా కనిపించాడు. కానీ.. ఈ అభ్యర్థనను ఫోర్త్ అంపైర్ తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. గ్లౌవ్స్ మార్చుకోనివ్వలేదన్న అసహనంతో ఉన్న స్టబ్స్, సరిగ్గా ఆ మరుసటి బంతికే అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసి ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచిన స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. జేమీ ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో మిడ్-ఆఫ్ మీదుగా బంతిని కొట్టే ప్రయత్నంలో స్టబ్స్ అవుటయ్యారు. ఆ క్యాచ్‌ను నూర్ అహ్మద్ అందుకున్నాడు. స్టబ్స్ వెనుదిరిగి వెళ్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో తన బ్యాట్, గ్లోవ్స్‌ను విసిరేశాడు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఢిల్లీ క్యాంప్ అంపైర్లతో వాదించిన దృశ్యాలు, స్టబ్స్ వీడియోలు వైరల్ అయ్యాయి.

అంతకుముందు, ఛేదనలో ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక (41) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 5 ఓవర్లలోనే 61 పరుగులు రాబట్టి రాజస్థాన్‌ను భయపెట్టారు. అయితే, నిస్సంక అవుట్ కావడంతో ఢిల్లీ జోరు తగ్గింది. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ వదిలేసినా, ఆ మరుసటి బంతికే నిస్సంక పెవిలియన్ చేరి ఆ అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. 61/2 స్కోరు వద్ద ఢిల్లీ పటిష్టంగా ఉన్నా, చెన్నై బౌలర్లు తమ వ్యూహాన్ని మార్చి ఢిల్లీని దెబ్బకొట్టారు. ఓవర్టన్, ఖలీల్, కాంబోజ్ తమ పేస్‌తో రెడ్ సాయిల్ పిచ్‌పై అదనపు బౌన్స్‌ను రాబట్టారు. దీంతో ఢిల్లీ బ్యాటర్లు షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డారు. చివరికి ఢిల్లీ 183/8 వద్ద ఆగిపోవడంతో చెన్నై ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేయగా, ఢిల్లీ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.

LMAO the script is getting too obvious now! 🤡

Umpires allow Sanju Samson to change his helmet mid-over without a word, but the second Tristan Stubbs asks for fresh gloves because he can’t even grip the bat in this humidity, suddenly they’re the "Time Management Police"?… https://t.co/9xD6Fz9obB

— OldMonkOfCricket (@BhushanManmath) April 12, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #IPLThriller
  • Chennai Super Kings win
  • cricket controversy news
  • CSK vs DC controversy
  • CSK vs DC highlights

తాజావార్తలు

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions