CSK: విజయ్ ప్రమాణ స్వీకారం వేళ.. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక సందేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, ఇదే రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే యాజమాన్యం తమ అభిమానులకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో అటు సీఎస్‌కే జట్టుకు, ఇటు ‘దళపతి’ విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ వేడుక, ఐపీఎల్ మ్యాచ్ ఒకే రోజు కావడంతో స్టేడియంలో ఎలాంటి రాజకీయ రంగు పడకుండా చూడాలని సీఎస్‌కే కోరింది. “మా సూపర్ ఫ్యాన్స్‌కు ఒక విన్నపం.. స్టేడియానికి వచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా వ్యక్తికి సంబంధించిన బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్‌లు తీసుకురావద్దు. కేవలం క్రికెట్‌ను మాత్రమే ఆస్వాదించండి” అని సీఎస్‌కే తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి విజయ్ గవర్నర్‌తో చర్చలు జరిపి, మిత్రపక్షాల మద్దతు కూడగట్టారు. శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్.. కాంగ్రెస్ (5), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ-ఎం (2), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (2) ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలియజేశారు. దీనితో 51 ఏళ్ల ఈ నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ వైఫల్యాలు, నిలకడలేని ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సేన, పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి టాప్-4 దిశగా అడుగులు వేయాలని పట్టుదలతో ఉంది. లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోవడంతో చెన్నైకి ఇకపై ప్రతి మ్యాచ్ చావో రేవో లాంటిదే.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
A special note for the fans coming to Anbuden tomorrow! 💛#AllYouNeedIsYellove pic.twitter.com/ZsT9r2Mtz7
— Chennai Super Kings (@ChennaiIPL) May 9, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!