Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: డిక్షనరీలో ‘ఫియర్లెస్ క్రికెట్’ (భయం లేని బ్యాటింగ్) అనే పదానికి అర్థం వెతికితే.. అక్కడ కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఫోటోనే కనిపిస్తుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు బ్యాటింగ్ శైలిని మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చేశాడు. మొహమ్మద్ షమీ, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్.. ఈ పేర్లు వింటేనే ఎంతటి సీనియర్ బ్యాటర్లకైనా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, వయసు తెచ్చిన అమాయకత్వమో లేక తన నైపుణ్యంపై ఉన్న నమ్మకమో తెలియదు కానీ, వైభవ్ మాత్రం ఎంతటి బౌలర్లనైనా చాలా కూల్‌గా ఎదుర్కొంటున్నాడు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ వైభవ్‌కు కెరీర్లో మొదటి ప్లేఆఫ్స్ మ్యాచ్. అయినా సరే, ఒత్తిడిని దరిచేరనీయకుండా 29 బంతుల్లో 97 పరుగులు చేసి తాను ఎందుకు ‘యూనివర్స్ బేబీ బాస్’ (Universe Baby Boss) అనిపించుకున్నాడో మరోసారి నిరూపించాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వైభవ్ పేరు మారుమోగిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 1 కోటి పెట్టి ఇతడిని సొంతం చేసుకుంది. అతని ప్రతిభ గురించి అప్పటికే కథలు కథలుగా విన్న ఫ్యాన్స్‌కు.. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఒక పెద్ద హింట్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో ఆరంభంలో తడబడినా.. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో భారత్‌కు వరల్డ్ కప్ అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతనిపై అంచనాలతో పాటు ఒత్తిడి సైతం పెరిగింది. అయితే, ఈ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే మ్యాట్ హెన్రీ వేసిన తొలి రెండు బంతులను ఫోర్, సిక్సర్‌గా మలిచి.. ఈ సీజన్లో రాబోయే తుఫానుకు వైభవ్ గట్టి హెచ్చరిక పంపాడు. అప్పటి నుంచి ప్రత్యర్థి, పిచ్‌లతో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 680 పరుగులు చేసి లీగ్‌లోనే టాప్ పర్ఫార్మర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్ రేసులో ఉన్నప్పటికీ.. ఈసారి ఆరెంజ్ క్యాప్ కొట్టే ఫేవరెట్లలో వైభవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న వయసు రికార్డులన్నీ దాటేసి.. ఇప్పుడు ‘ఆల్ టైమ్ బెస్ట్’ రికార్డులను బద్దలు కొట్టే స్థాయికి ఎదిగాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
వైభవ్ ఫామ్ ఇప్పుడు టీమిండియా సెలక్టర్లు తలనొప్పిగా మారిందట. వైభవ్‌ను వెంటనే సీనియర్ జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నప్పటికీ.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఈ విషయంలో కాస్త ఆచితూచి స్పందించారు. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే టెస్ట్, వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైభవ్ కంటే ముందు రేసులో మరికొందరు యువ ప్రతిభావంతులు ఉన్నారని, ముఖ్యంగా యశస్వి జైస్వాల్ పేరును ప్రస్తావించారు. అలాగే శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం వైభవ్‌ను ‘ఇండియా-A’ జట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని అగార్కర్ గుర్తుచేశారు. “వైభవ్ చాలా చిన్నవాడు, అపారమైన ప్రతిభ ఉన్నవాడు కాబట్టే అతనికి అనుభవం కోసం ఇండియా-A జట్టులో అవకాశం ఇచ్చాం. ఇప్పటికే యశస్వి జైస్వాల్ వన్డే సెటప్‌లో భాగమయ్యాడు. వైభవ్ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో, దేశవాళీలో అంతే బాగా ఆడుతున్న మరికొందరు కూడా లైన్లో ఉన్నారు. వైభవ్ ఆటపై మాకు ఎంతో ఆసక్తి ఉంది, ఇండియా-A పర్యటనలో అతను తన ప్రతిభను చాటుకుంటాడని ఆశిస్తున్నాం” అని అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి నిలకడైన ఫామ్ చూపిస్తే ఏ ఆటగాడైనా జాతీయ జట్టులోకి సులువుగా వచ్చేస్తాడు. కానీ వైభవ్ విషయంలో బీసీసీఐ ‘వేచి చూసే ధోరణి’ని అవలంబిస్తోంది. దీనికి కారణంగా వయసు అని చెబుతున్నారు. కెరీర్ ఆరంభంలోనే అతడిని అంతర్జాతీయ క్రికెట్ అనే అత్యున్నత ఒత్తిడిలోకి నెట్టడం సెలెక్టర్లకు ఇష్టం లేదు. అయితే, ఒక ఆటగాడిగా వైభవ్ చేయాల్సింది అంతా చేసేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు, పరిణతి గల ఆటతీరు, సన్‌రైజర్స్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్.. ప్రపంచం మొత్తం తన వైపు చూస్తున్నప్పుడు కూడా తనేంటో నిరూపించుకోవడానికి ఇవన్నీ చాలు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!