IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
- ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్ పైనే
- టాప్-4లో ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్
- ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB And GT Strong Favorites To Win IPL 2026 Title: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు టాప్-4లో నిలిచాయి. ఈ నాలుగు జట్లూ ఇప్పటికే ఒక్కోసారి టైటిల్ గెలిచిన నేపథ్యంలో.. ఈ సీజన్లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏదన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే.. టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఆర్సీబీ లేదా జీటీకే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మంగళవారం ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు బుధవారం న్యూ చండీగఢ్‌లో జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. విజేత క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేత టీమ్ క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతాయన్న విషయం తెలిసిందే.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే 2011 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత ప్లేఆఫ్స్ ఫార్మాట్ గణాంకాలు చూస్తే.. టైటిల్ గెలిచే అవకాశాలు టాప్-2 జట్లకే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత 15 సీజన్లలో 14 సార్లు క్వాలిఫయర్-1 ఆడిన రెండు జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అంటే ఈసారి కూడా ఆర్సీబీ లేదా గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచే అవకాశాలు 93.3 శాతంగా ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ ఆడే ఎస్ఆర్హెచ్ లేదా రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచే అవకాశాలు కేవలం 6.66 శాతమే.
ప్రస్తుత ప్లేఆఫ్స్ ఫార్మాట్లో టాప్-2లో లేకుండానే టైటిల్ గెలిచిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. 2016లో మూడో స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్లో ఆర్సీబీని ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన ఏ జట్టూ ఛాంపియన్ కాలేదు. అందుకే ఈసారి రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి సవాలు ఎదురుకానుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే చివరికి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం 2013, 2017లో ముంబై ఇండియన్స్.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేశాయి. అలాగే క్వాలిఫయర్-1 ఆడిన జట్లు 15లో 12 సార్లు ఫైనల్‌కు కూడా చేరుకున్నాయి.
ఈ గణాంకాలన్నీ ఇప్పుడు ఆర్సీబీ, గుజరాత్ అభిమానుల్లో మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయి. అయితే టీ20 క్రికెట్ అనిశ్చితికి మరో పేరు. ఒక్క మ్యాచ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, అలాగే విధ్వంసక బ్యాటింగ్‌తో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా చరిత్రను తిరగరాసే సామర్థ్యం కలిగిన జట్లే. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మరింత ఉత్కంఠభరితంగా మారాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!