Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు
- పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి సన్‌రైజర్స్
- సన్‌రైజర్స్ విజయాల ప్లాన్ ఏంటో చెప్పిన ఇషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు అందుకుంది. ఢిల్లీ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు వ్యూహాల గురించి వెల్లడించాడు. తమ ప్లాన్ చాలా సింపుల్ అని, మ్యాచ్‌ను మ్యాచ్‌గా తీసుకుంటాం అని చెప్పాడు. జట్టులో అందరూ దూకుడుగా ఆడాలని కోరుకుంటారని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో తాము గెలిచామని ఇషాన్ పేర్కొన్నాడు.
‘చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడాలో అర్థం కావడం లేదు. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ బాగా ఫినిష్ చేయడం చూసిన తర్వాత మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు. ఈ తరహా పిచ్‌పై 200కు పైగా స్కోర్ చేయడం చాలా గొప్ప విషయం. బంతి పాతబడిన తర్వాత కొత్తగా క్రీజ్‌లోకి వచ్చే బ్యాటర్లకు పెద్ద షాట్లు ఆడటం అంత సులభం కాదు. అయినా కూడా ఈ విజయంలో మొత్తం క్రెడిట్ అభిషేక్‌కే ఇవ్వాలి. మా ప్లాన్ చాలా సింపుల్. మ్యాచ్‌ను మ్యాచ్‌గా ఆడుతున్నాం అంతే. మేమెప్పుడూ ఒక్కో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం. ఒక్కరోజు ఒకరు బాధ్యతగా ఆడుతున్నారు. జట్టులో ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడాలని ఇష్టపడతారు. అందుకే మొదటి 2-3 బంతులు ఆడి పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకుంటారు. బౌన్స్ ఎలా ఉందో చూసి, ఆ తర్వాత బ్యాట్ జుళిపిస్తారు. మేం ఎక్కువగా ప్లాన్లు చేసుకోం, బంతిని చూసి ఆడటమే మా విధానం’ అని ఇషాన్ స్పష్టం చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
‘హర్ష్ దూబే బౌలింగ్‌ను కొనసాగించడంపై ఎలాంటి వ్యూహం లేదు. బంతులు, పరుగుల రేషియోను బట్టి బౌలింగ్ ఇచ్చాం. ఈ తరహా పిచ్‌లపై బ్యాటర్లు భారీ షాట్స్ ఆడడం అంత సులభం కాదు. దూబే మంచి బౌలర్, చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడని నాకు తెలుసు. అందుకే అతనితో మాట్లాడి నువ్వు కీలక ఓవర్లు వేయాలి అని చెప్పాను. మా ప్లాన్ ఏమిటంటే ప్రత్యర్థి జట్టులో బెస్ట్ బ్యాటర్లు క్రీజ్‌లో ఉన్నప్పుడు మా బెస్ట్ బౌలర్లను ఉపయోగించడం. అది మాకు బాగా వర్క్ అయింది. ఇక నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువగా మాట్లాడను. ఆటను ఆస్వాదించమని మాత్రమే మా ఆటగాళ్లకు చెబుతా’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!