IPL 2026 Coincidences: ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు.. అభిమానులను ఆశ్చర్యపరుస్తోన్న ఫలితాలు!
- ఐపీఎల్ 2026 ఆరంభం నుంచే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు
- అభిమానులకు అసలైన మజాను అందిస్తున్న ఐపీఎల్
- ఐపీఎల్ 2026లో అరుదైన సంఘటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందిస్తున్నాయి. బ్యాటర్ల ధనాధన్ ఇన్నింగ్స్, బౌలర్ల మ్యాజిక్ బౌలింగ్, సూపర్ క్యాచ్‌లతో ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులను కట్టిపడేశాయి. అయితే తొలి నాలుగు మ్యాచ్‌లలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నాలుగు మ్యాచ్‌లలో ఒకే తరహా ఫలితాలు రావడంపై అభిమానుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026లోని మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఓ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. అన్ని మ్యాచ్‌ల్లో హోమ్ జట్లు విజయం సాధించాయి. అదే సమయంలో చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. అంతేకాదు ప్రతి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుని.. విజయం సాధించాడు. ఈ మూడు అంశాలు నాలుగు మ్యాచ్‌ల్లో ఒకేలా పునరావృతం కావడం విశేషం. ఈ మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఓడిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Amaravati Capital: రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ.. పార్లమెంట్‌కు నారా లోకేష్!
ఈ తరహా అరుదైన ఫలితాలు క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులు, పిచ్, జట్టు ప్రదర్శన మారుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విధమైన ఫలితాలు రావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభమే ఇలా ఆసక్తికరంగా సాగుతుండటం ఈ సీజన్‌పై మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఇక ముందు మ్యాచ్‌ల్లో కూడా ఇలాంటి ట్రెండ్స్ కొనసాగుతాయా లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!