IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
- ముగిసిన ఐపీఎల్ 2026 లీగ్ దశ
- బద్రీనాథ్ ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11
- విరాట్ కోహ్లీకి జట్టులో చోటే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసింది. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు టాప్ 4లో చోటు దక్కించుకున్నాయి. ఇక నేటి నుంచి ప్లేఆఫ్స్ సమరం ఆరంభం కానుంది. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ ఎస్ బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ 11ను ఎంపిక చేశాడు. అయితే ఈ జట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్ 2026లో 550కు పైగా పరుగులు చేసిన కింగ్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు బద్రీనాథ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఎస్ బద్రీనాథ్ ఎంపిక చేసిన జట్టులో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్ల నుంచే ఎక్కువ మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్లను ఎంపిక చేశాడు. ఈ ఇద్దరూ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ భారీ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో దూకుడైన బ్యాటింగ్ కోసం హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేయగా.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌కు ఐదో స్థానంలో చోటు దక్కింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆల్‌రౌండర్ల విభాగంలో ఆర్సీబీ స్టార్ కృనాల్ పాండ్యా, కోల్‌కతా నైట్ రైడర్స్ సీనియర్ ఆటగాడు సునీల్ నరైన్‌లను ఎస్ బద్రీనాథ్ ఎంపిక చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ సీజన్లో 19 వికెట్లు తీసిన రషీద్ ఖాన్‌ను ప్రధాన స్పిన్నర్‌గా తీసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడలకు చోటు కల్పించాడు. అదనపు పేసర్‌గా కార్తీక్ త్యాగి లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ అకీల్ హోసేన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేశాడు.
ఎస్ బద్రీనాథ్ ప్లేయింగ్ 11:
వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పాటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.
ఇంపాక్ట్ ప్లేయర్: అకీల్ హోసేన్.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!