SRH vs RR Qualifier 2: హైదరాబాద్, రాజస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్, వాతావరణం డీటెయిల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచ్‌లు హైదరాబాద్ గెలవగా.. 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఓసారి తలపడగా.. సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై హైదరాబాద్ అత్యధిక స్కోరు 217 కాగా.. అత్యల్ప స్కోరు 127. హైదరాబాద్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పిచ్:
చెన్నైలో ప్రస్తుతం వేడి చాలా ఎక్కువగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండొచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్టే నెగ్గింది.
వాతావరణం:
క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..