Vaibhav Sooryavanshi Wicket: పక్కాగా ప్లాన్ చేసి.. వైభవ్ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం
- ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కెప్టెన్, కోచ్ కీలక పాత్ర
- వైభవ్ సూర్యవంశీని బుట్టలో వేసిన ఆ ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కెప్టెన్, కోచ్ వ్యూహలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్, అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే మధ్య జరిగిన చర్చే ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి పునాది అయింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్.. రాజస్థాన్‌పై డెబ్యూ చేసిన ఇద్దరు బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌తో ప్రత్యేకంగా మాట్లాడానని చెప్పాడు. ఆటను ఆస్వాదిస్తూ తమ సహజమైన గేమ్ ఆడాలని సూచించినట్లు తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని, ఇద్దరు బౌలర్లు వచ్చిన నేపథ్యం దృష్ట్యా ఈ ప్రదర్శన గొప్పదని కొనియాడారు. అయితే వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన క్రెడిట్ మాత్రం హింగేకే చెందుతుందని వరుణ్ ఆరోన్ స్పష్టం చేశాడు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
‘రాజస్థాన్ మ్యాచ్ ముందు ప్రఫుల్ హింగే నాతో మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన అనుభవం తనకు ముందే ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఔట్ చేస్తానని నమ్మకంగా చెప్పాడు. నేను కూడా అతడిని ప్రోత్సహించా. అయితే బౌలింగ్ యాంగిల్‌పై చిన్న సూచన చేశా. హింగే రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాడు. ఓవర్ ది వికెట్ నుంచే బౌలింగ్ చేయమని నేను సూచించా. ఆ వ్యూహం మైదానంలో వర్కౌట్ అయింది. హింగే తన రెండో బంతికే సూర్యవంశీని ఔట్ చేసి మ్యాచ్‌కు ఊపు తెచ్చాడు. ఆ వికెట్ తర్వాత రాజస్థాన్ బ్యాటింగ్ కుప్పకూలింది. కొన్ని ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిపోయింది’ అని వరుణ్ ఆరోన్ తెలిపాడు.
Also Read: Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రఫుల్ హింగే మొదటి ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీతో పాటు ధృవ్ జురెల్, ప్రిటోరియస్ వికెట్లు తీసి రాయల్స్‌ను షాక్‌కు గురిచేశాడు. అనంతరం కెప్టెన్ రియాన్ పరాగ్ వికెట్ కూడా తీసి.. మొత్తం నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వైపు తిప్పాడు. అతని బౌలింగ్‌తో రాయల్స్ ఇన్నింగ్స్ పూర్తిగా వెనకపడిపోయింది. మరో ఎండ్‌లో యువ పేసర్ సకిబ్ హుస్సేన్ వికెట్ల వేట కొనసాగించాడు. యశస్వి జైస్వాల్, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వికెట్లతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 159 పరుగులకు రాజస్థాన్ ఆలౌట్ అయింది. స్పష్టమైన ప్లాన్, ఆటగాళ్లపై నమ్మకం ఈ విజయానికి కారణమయ్యాయి. సన్‌రైజర్స్ యువ బౌలర్లు చూపించిన ఈ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!