Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో ప్రతిభను చాటుకుంటున్న యువ ఆటగాళ్లు
- అరంగేట్ర మ్యాచ్‌లో సకిబ్ హుస్సేన్ అద్భుత ప్రదర్శన
- ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మలు ఇప్పటికే మెరవగా.. తాజాగా బిహార్‌కు చెందిన యువ పేసర్ సకిబ్ హుస్సేన్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమవారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున బరిలోకి దిగిన సకిబ్.. సంచలన బౌలింగ్ (4/24) ప్రదర్శనతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సకిబ్.. ఈ ప్రదర్శనతో తాను ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ప్రతి ప్లేయర్ ఇలాంటి డెబ్యూ గురించి కలలు కంటాడని చెప్పుకొచ్చాడు.
‘ప్రతి ఆటగాడూ ఇలాంటి అరంగేట్రంనే కోరుకుంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను ఆడబోతున్నానని మ్యాచ్‌కు ఒక రోజు ముందు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ చెప్పారు. అప్పటి నుంచి నా దృష్టి మొత్తం మంచి ప్రదర్శనచేయడంపై పెట్టా. మానసికంగా నేను పూర్తిగా సిద్ధం అయ్యాను. జట్టుకు నా వంతు సహాయం చేయాలనే సంకల్పంతో మైదానంలోకి దిగా. నా బౌలింగ్‌లో కనిపిస్తున్న మెరుగుదలకు కారణం కోచ్ వరుణ్ ఆరోన్. ఈ క్రెడిట్ ఆయనదే’ అని సకిబ్ హుస్సేన్ స్పష్టం చేశాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
‘గత నాలుగు మ్యాచ్‌లుగా కోచ్ వరుణ్ ఆరోన్‌తో కష్టపడి పని చేస్తున్నా. ఆయన దగ్గర నుంచి ప్రతి అంశం నేర్చుకున్నా. ఆయనకు నా కృతజ్ఞతలు. ఒక యువ ఆటగాడిగా ఆయన మార్గదర్శకం ఎంతో ఉపయోగపడింది. అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్లు తీయడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. నిజానికి ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. మొదటి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడం నా కెరీర్‌కు మంచి ఆరంభం. భవిష్యత్తులో కూడా ఇలానే రాణించాలని ఆశిస్తున్నా’ అని ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ సకిబ్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!