Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!
- 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి
- ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర అసంతృప్తి
- ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు
- ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya About MI Defeat To PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ముంబై 6 వికెట్లకు 195 పరుగులు చేయగా.. పంజాబ్ 16.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేనని, ప్రస్తుతం ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదని, మొత్తం టీమ్ మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే.. ఇప్పుడు మాట్లాడానికి ఎక్కువగా ఏమీ లేదు. మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో ముందు తెలుసుకోవాలి. అది వ్యక్తిగతం గానా, జట్టు గానా లేదా ప్లానింగ్‌లోనా అన్నది గుర్తించాలి. మరలా అన్ని అంశాలను విశ్లేషించాల్సిందే. మేము అనుకున్న దానికంటే తక్కువ రన్స్ చేశాం. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. బంతి రివర్స్ స్వింగ్ అవ్వడం ప్రారంభమైంది. అదే సమయంలో పిచ్ కూడా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం రావడంతో బ్యాటింగ్ కొంచెం సులభమైంది. అయినప్పటికీ పంజాబ్ అన్ని విభాగాల్లో మాకంటే మెరుగ్గా రాణించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా ఆడారు. అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది’ అని తెలిపాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడిన హార్దిక్ పాండ్య.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించాడు. ‘మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలా? లేదా ఇదే జట్టుతో కొనసాగుతూ పరిస్థితులు మారుతాయని ఆశించాలా? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. వరుస ఓటములు ఎదురయ్యాయి. ఇది మాకు కఠిన సమయం. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి. ఏదైనా సరే బాధ్యత తీసుకోవాల్సిందే’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. హార్దిక్ వ్యాఖ్యలు ముంబైలో పరిస్థితి అంత సానుకూలంగా లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. జట్టు త్వరగా సమస్యలను గుర్తించి పరిష్కారం కనుక్కోకపోతే.. ఐపీఎల్ 2026లో మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!