Dinesh Karthik Retirement: ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్ గుడ్ బై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Happy Retirement DK Tag Trend in X: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2024లో కార్తీక్ 15 మ్యాచ్‌లు ఆడి 326 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో 2008 ఎడిషన్ నుంచి దినేశ్ కార్తిక్ ఆడుతున్నాడు. 17 సీజన్లలో ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు కార్తిక్ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడాడు. చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: RCB vs RR: రాజస్థాన్ చేతిలో ఓటమి.. ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు ఔట్!
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ కార్తిక్ గుడ్‌బై చెప్పాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. డీకే 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ఎంఎస్ ధోనీ వెలుగులోకి రావడంతో అతడు కనుమరుగయిపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్ ఆడాడు. 94 వన్డే మ్యాచ్‌లు ఆడిన కార్తిక్.. 1752 పరుగులు, 64 క్యాచ్‌లు అందుకున్నాడు. 60 టీ20లలో 686 రన్స్, 30 క్యాచ్‌లు పట్టాడు.
Dinesh Karthik getting guard of honour from RCB and the crowd chanting 'DK, DK'.
– The most emotional video. 🥹💔 pic.twitter.com/XZ3WmbO5Ne
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2024
Heart-breaking video….!!! 💔
– Thank you, DK for all memories in IPL. pic.twitter.com/qBajRBZXQi
— Johns. (@CricCrazyJohns) May 22, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!