TV Actress Shalini: విడాకులు తీసుకుంది.. ఫోటోలు చించి పండగ చేసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Actress Shalini Celebrated Her Divorced: మారుతున్న కాలానికి అనుగుణంగా.. సెలెబ్రిటీలు సరికొత్త ట్రెండ్‌లకు తెరతీస్తున్నారు. ఊహించని సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇప్పుడు ఓ టీవీ నటి.. తన విడాకులను పండుగల వేడుక చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటే, ఆ వ్యవహారం కాస్త వాడీవేడీగా నడుస్తుంది. ఆ తారలతో పాటు వారి అభిమానులు సైతం నెట్టింట్లో తమ బాధను వ్యక్తపరుస్తుంటారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ.. విచారం తెలుపుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే.. అది ఒక విషాదకరమైన మూమెంట్. కానీ.. టీవీ నటి షాలిని మాత్రం తన విడాకుల్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన పెళ్లి ఫోటోలను చించుతూ.. ఒక ఫోటోషూట్ కూడా నిర్వహించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Gangula Kamalakar: రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ
Also Read
తమిళ ఇండస్ట్రీకి చెందిన టీవీ నటి షాలినికి మంచి పాపులారిటీ ఉంది. ముల్లుమ్ మల్లరుమ్ అనే సీరియల్‌తో ఈమె ఫేమ్ సంపాదించింది. జీ తమిళ్‌లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలోనూ పాల్గొంది. కట్ చేస్తే.. షాలిని గతంలో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో ఒక కుమార్తెను కూడా కనింది. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. భర్త రియాజ్ తనని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కొన్ని నెలల క్రితం షాలిని కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన కోర్టు.. తాజాగా విడాకులకు మంజూరు తెలిపింది. మొత్తానికి తాను అనుకున్నది సాధించడంతో.. ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా.. ఫోటోషూట్ నిర్వహించి, చాలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన మాజీ భర్తతో కలిసి దిగిన ఫోటోలను సగానికి చించేస్తూ.. ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..
‘‘తమ గళం విప్పడానికి భయపడుతూ లోలోపలే మదన పడుతున్న వారికోసం.. విడాకులు తీసుకున్న నా నుంచి ఇదే మీకు సందేశం. దాంపత్య జీవితం సాఫీగా సాగనప్పుడు.. ఆ బంధం నుంచి బయటకు రావడమే ఎంతో శ్రేయస్కరం. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితం ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తుని మెరుగుపరచుకోవడం కోసం.. తగిన మార్పులు చేసుకోండి. విడాకులు తీసుకున్నంత మాత్రాన మనం ఫెయిల్ అయినట్టు కాదు. మీ జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్. మీ జీవితంలో సానుకూల మార్పుకు సంకేతం. ఇలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి కాబట్టి.. నాలాంటి ధైర్యవంతులైన మహిళలకు ఇది అంకిత చేస్తున్నా’’ అంటూ రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!