Chikoti Praveen On Thailand Raid Case: థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే! ఈ గ్యాంబ్లింగ్ విషయం తెలిసి మే 1వ తేదీన చౌనబురి ప్రావిన్స్ పోలీసులు ఆ సెంటర్‌పై దాడులు నిర్వహించి.. ప్రవీణ్ సహా చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ కేసులో థాయ్‌లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 4500 బాట్స్ జరిమానాతో చికోటి ప్రవీణ్ సహా 83 మంది భారతీయులకు బెయిల్ ఇచ్చింది. అయితే.. జరిమానా కట్టేవరకు పాస్‌పోర్టులు ఇవ్వొద్దని చెప్పింది. గంట గ్యాప్‌లోనే ఫైన్ చెల్లించడంతో.. పోలీసులు వారికి పాస్ట్‌పోర్టులు ఇచ్చి విడుదల చేశారు.
TV Actress Shalini: విడాకులు తీసుకుంది.. ఫోటోలు చించి పండగ చేసుకుంది
ఈ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధమని తనకు తెలియనది తెలిపాడు. తాను హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే పోలీసులు దాడులు నిర్వహించారని అన్నాడు. అయితే.. తాను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని, బయటపడ్డానని చెప్పాడు. తాను ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్‌ని కాదని, అసలు తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశాడు. తనకు దేవ్, సీత ఆహ్వానం పంపారని.. వారి ఆహ్వానం మేరకు తాను వెళ్లానని వెల్లడించాడు. ఆ సెంటర్‌లో నాలుగు రోజుల పాటు పోకర్ టోర్నమెంట్ ఉంటుందని, ఆ టోర్నీ లీగల్ అని వాళ్లు తనకు చెప్పారని, తనకు లేఖ కూడా పంపారని చెప్పాడు. ఆ లేఖలో స్టాంప్‌లు కూడా ఉన్నాయని, అయితే థాయ్‌లాండ్‌లో ఇల్లీగల్ అనే విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
P Pullaiah: మరపురాని ‘మమ్మీ-డాడీ’!