Sanju Samson: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. తొలి క్రికెటర్‌గా సంజూ శాంసన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson becomes fastest Indian to hit 200 Sixes IPL: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. సంజూ కేవలం 159 ఇన్నింగ్స్‌లలో 200 సిక్సర్లను బాదాడు.
ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. 165 ఇన్నింగ్స్‌లో మహీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజాగా ధోనీ ఆల్‌టైమ్ రికార్డును సంజూ శాంసన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సంజూ, ధోనీ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (180 ఇన్నింగ్స్), రోహిత్ శర్మ (185 ఇన్నింగ్స్), సురేశ్ రైనా (193 ఇన్నింగ్స్)లు ఉన్నారు. ఐపీఎల్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన 10వ బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్టార్లతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!
ఈ ఎడిషన్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటర్‌గా మరియు కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత అత్యధిక పరుగుల చేసిన మూడవ ఆటగాడిగా ఉన్నాడు. సంజూ 11 మ్యాచ్‌లలో 471 రన్స్ బాదాడు. 2020 సీజన్ తర్వాత స్టీవ్ స్మిత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాయల్స్‌ను శాంసన్ ముందుండి నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 ప్రదర్శనతోనే టీ20 ప్రపంచకప్ 2024లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!