ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 41వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రుజ్ సొంతం చేసుకున్న బన్నీకి దేశం నలువైపుల నుంచి బర్త్ డే విషెస్ వస్తున్నాయి. పుష్ప చిత్రం ఇండియాలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లు సైతం అల్లు అర్జున్ ని అనుకరిస్తూ ఇన్ స్టా రిల్స్ చేశారు. డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలా తో కలిసి చెప్పిన విషెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలిసి ఒక వీడియో షేర్ చేశాడు. బిగ్ షాట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే.. పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం.. ఈ బర్త్ డే నీకు చాలా గొప్పగా ఉండాలి అంటూ వార్నర్ తన కుమార్తె ఐలాని తో కలిసి చెప్పాడు.
Also Read : Pakisthan : గందరగోళంలో పాకిస్తాన్ క్రికెట్ టీమ్
హ్యాపీ బర్త్ డే పుష్ప అంటూ ముద్దు ముద్దుగా చెప్పిన విషెస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కు ఆడినప్పుడు తెలుగు అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వార్నర్ ని తెలుగు ఆడియన్స్ ఇష్టపడతారు. వార్నర్ కూడా తెలుగు స్టార్స్ అందరికీ సంబంధించిన రీల్స్ చేస్తుంటాడు. మరోవైపు అల్లు అర్జున్ కోస్టార్ రస్మిక మందన.. బన్నీకి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. అల్లు అర్జున్ తో కలిసి బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను రష్మిక షేర్ చేసింది. నా పుష్పరాజ్ కు హ్యాపీయెస్ట్ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. నిన్ను మరోసారి పుష్పగా చూసేందుకు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.. నువ్వు ఇంకా ఎక్కువగా నచ్చుతావు అని రష్మిక పోస్ట్ పెట్టింది.
Also Read : PM Modi: అవినీతిని నేను ఒప్పుకోను.. వారి పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా?
