BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
- ఐపీఎల్ 2026లో బీసీసీఐ కీలక నిర్ణయం
- నేడు జీటీ vs ఆర్ఆర్ క్వాలిఫయర్-2
- కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్‌గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్‌లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ విడుదల చేసిన అడ్వైజరీ ప్రకారం.. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ గాగుల్స్‌ను మార్కెట్ చేస్తున్నాయి. ఈ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేయడం వంటి సదుపాయాలు ఉంటాయని బీసీసీఐ పేర్కొంది. మొబైల్ డేటా లేదా వైఫై ద్వారా పనిచేసే ఈ పరికరాలను కమ్యూనికేషన్ డివైస్ గానే కాకుండా ఆడియో-వీడియో రికార్డింగ్ డివైస్ గానూ పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్, మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియాలో ఈ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
మ్యాచ్ రోజుల్లో స్టేడియంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా సెక్యూరిటీ లియాజన్ ఆఫీసర్ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది. ఇటీవల ఐపీఎల్లో కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంతో బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రోమీ భిందర్ మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు వార్నింగ్ కూడా జారీ అయింది. ఆ ఘటన తర్వాతే బీసీసీఐ భద్రతా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది.
ఇప్పటికే ఆటగాళ్లు రాత్రివేళ అనుమతి లేకుండా బయటకు వెళ్లకుండా బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే భద్రతా కారణాలు, హనీ ట్రాప్ భయాలతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ గదుల్లో అతిథులను అనుమతించడాన్ని కూడా నిషేధించింది. ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్‌పై నిషేధం విధించడం ద్వారా బీసీసీఐ ఐపీఎల్లో అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!