IPL Media Rights: బాబోయ్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.100 కోట్లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రూ.కోట్ల సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరుతోంది. డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ వేలం నిర్వహించడం ద్వారా రూ.45వేల కోట్లు వస్తాయని తొలుత బీసీసీఐ అంచనా వేయగా ఎ, బి ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ విలువ రూ.43,050 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరోవైపు సి, డి ప్యాకేజీల బిడ్డింగ్ ద్వారా రూ.5,500 కోట్లు వస్తాయని బీసీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఇప్పటివరకు జరిగిన బిడ్డింగ్‌ను పరిశీలిస్తే ఒక్కో మ్యాచ్ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.
గత ఐదేళ్ల కాలంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించి ఒక్కో మ్యాచ్ విలువ రూ.54.5 కోట్లు మాత్రమే. ఆ లెక్కన ఇప్పటి బిడ్డింగ్ డబుల్ అయిందనే చెప్పాలి. ఇది నమ్మశక్యంగా లేదని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. టీవీ, డిజిటల్ హక్కుల కోసం బిడ్డింగ్ రూ.50వేల కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బిడ్డింగ్‌లో రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ స్టార్, సోనీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీ ఎ కోసం వేసిన బిడ్డింగ్‌కు జీ సంస్థ దూరంగా ఉండగా ప్యాకేజీ బిలోని డిజిటల్ ప్రసారాల హక్కుల కోసం జీ సంస్థ రేసులో ఉంది. దీంతో డిజిటల్ ప్రసారాల కోసం నాలుగు సంస్థల మధ్య పోటీ నెలకొంది. ప్యాకేజీ ఎలోని టీవీ ప్రసారాల బిడ్ రూ.23,370 కోట్లు, ప్యాకేజీ బిలోని డిజిటల్ ప్రసారాల బిడ్ రూ.19,680 కోట్లకు చేరింది.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- ODI World Cup 2027: ద్రవిడ్ ప్లానింగ్ లేకుండా ఉంటాడా?.. 2027 వరల్డ్ కప్‌కు బ్లూప్రింట్ సిద్ధం!
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!