IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!
- ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ప్రాంచైజీలకు భారీ ఎదురుదెబ్బ
- గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం
- కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేని ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruled Out Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ప్రాంచైజీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్లేయర్స్ గాయాలు జట్ల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2026 ముందు గాయపడిన ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరమవగా.. శ్రీలంక స్టార్ బౌలర్ పతిరానా కూడా గాయంతో అందుబాటులో లేడు. ఈ ఇద్దరు స్టార్స్ అందుబాటులో లేకుండా పోవడంతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఆడడం లేదు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా గాయంతో తప్పుకున్నాడు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
న్యూజీలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020లోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఫెర్గ్యూసన్ ఆడుతున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా దూరమవగా.. కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఇది సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటుగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి కూడా గట్టి షాక్ తగిలింది.
Also Read: TC Rajan Dead: పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత.. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే బలహీనంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్ల గాయాలు జట్ల సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ లోటును జట్లు ఎలా భర్తీ చేస్తాయో, యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో అన్నది ఈ సీజన్లో కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!