IPL 2024: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్.. వాతావరణం ఎలా ఉందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ టీమ్స్ మధ్య జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ నేటి రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా, మ్యాచ్‌కు ముందు సీజన్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఎఆర్ రెహ్మాన్, సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు.

Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ఇక, సీఎస్‌కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు అని చెప్పింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం నాడు రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది.. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు అని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు.
Read Also: Operation Valentaine OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
అయితే, చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుంది.. అలాగే, తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలింది. ఈ పిచ్‌పై టార్గెట్ ఛేదించడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కే విజయావకాశాలు ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల స్పిన్నర్లు చెలరేగే ఛాన్స్ ఉంది. అలాగే, ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు పోటీ పడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించాయి. అయితే, ఓ మ్యాచ్‌లో టై అయింది. ఇక, ఆర్సీబీపై సీఎస్‌కే పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో ఏకంగా సీఎస్కే ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆర్సీబీ గెలిచింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!