MS Dhoni : ప్లీజ్ ధోని.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవొద్దు.. మహీకి పైలెట్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ఆటతీరుకు ఫిదా అయిన అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్ కూల్ అని, తలైవా అని పిలుచుకుంటుంటారు. అన్నీ ఫార్మాట్లలోనూ అదరగొట్టే ఈ స్టార్ ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు. గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నో కీలక మ్యాచ్ ల్లో గెలిపించి నాలుగు సార్లు జట్టుకు టైటిల్ అందించాడు. అయితే 2008 నుంచి సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా ఉన్న ధోనీ.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ రిటైర్మెంట్ ను ప్రకటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన ఆటగాడిని ఇక ఎల్లో జెర్సీలో చూడలేం అంటూ బాధపడుతున్నారు.

Also Read : Viral : మల విసర్జన చేస్తుండగా పొట్టలోకి పాము.. డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టిన వ్యక్తి
Also Read
- Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
- Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
సామాజిక మాధ్యమాల వేదికగా రిటైర్మెంట్ చేయొద్దంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ అభిమాని ఎంఎస్ ధోని రిటైర్ అవ్వద్దంటూ స్వయంగా అతడినే కోరాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇవాళ ( ఏప్రిల్ 8 న) ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చెన్నై నుంచి ముంబయికి పయనమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న చెన్నై విమానాశ్రయంలో సీఎస్కే టీమ్ ఫ్లైట్ ఎక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలెట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలెట్ మాట్లాడాడు. ఎంఎస్ ధోని నేను మీకు పెద్ద అభిమానిని.. దయచేసి ఇంకొంత కాలం మీరు సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా కొనసాగండి.. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్ద అంటూ కోరాడు. పైలెట్ మాటలు విన్న ప్యాసెంజర్స్ ఈ విజువల్స్ ను తమ కెమెరాల్లో బంధించారు. అయితే ఇదే తన చివరి సీజన్ అని ధోని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అంతే కాక రిటైర్మెంట్ రూమర్స్ పై ఎప్పుడూ స్పందించలేదు.. మరోవైపు సీఎస్కే ప్లేయర్స్ కూడా ఈ విషయంపై ఇటీవలే స్పందించారు. అలాంటిదేమి లేదు.. ధోని ఫిట్ గా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల పాటు ఆడతాడు అని తెలిపారు.
https://twitter.com/TheDhoniEra/status/1644028511668277248
Also Read : Singareni: ప్రధాని మోడీ హటావో-సింగరేణి బచావో.. కేంద్రంపై జంగ్ సైరన్
ఇటీవలే సొంత గడ్డపై లక్నో తో జరిగిన మ్యాచ్ లో గెలిచి ఈ సీజన్ లో తొలి విజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. అయితే ఆ మ్యాచ్ అంత ఈజీగా గెలవలేదు. 13 వైడ్లు, 3 నోబాల్స్ వేసి అదనపు పరుగులు ఇచ్చిన బౌలర్ల వల్ల విజయం కోసం సీఎస్కే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అయిపోయాక బౌలర్ల ప్రదర్శనపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆట శైలిని మార్చుకోకపోతే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!