ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. అయితే 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
అంతకముందు 10 పరుగులు చేసిన సుయాష్ ప్రభుదేశాయ్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26 పరుగులు చేశారు. చివర్లో కార్తిక్ 8 బంతుల్లో 13 నాటౌట్‌గా మిగిలాడు. కాగా నాలుగు పరుగుల తేడాతో డుప్లెసిస్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.