Rohit Sharma: హిట్‌మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఫామ్‌లో లేడు.. ఇక రిటైర్మెంట్ తప్పదు.. ఇదే చివరి మ్యాచ్.. ఇలా ఎన్నో ప్రచారాలకు ఒకే ఇన్నింగ్స్‌తో తెర దించాడు హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. 39 ఏళ్ల వయసులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం కష్టమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ శతకం కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. తనపై వచ్చిన విమర్శలకు, రిటైర్మెంట్ చర్చలకు బ్యాట్‌తో ఇచ్చిన సమాధానంగా మారింది.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 11, 26 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో అతని ఫామ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు మార్పుల దిశగా అడుగులు వేస్తోందని, సెలెక్టర్లు కూడా యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్ వన్డే రోహిత్‌కు కీలక పరీక్షగా మారింది.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఒత్తిడి ఒకవైపు, తన భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ మరోవైపు ఉన్నా, రోహిత్ మాత్రం తన సహజ శైలిని మార్చుకోలేదు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్లపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లు కట్టడి చేయాలని ప్రయత్నించినా వారికి అవకాశం ఇవ్వలేదు. మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 138 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ క్లాస్‌ను చాటాడు. ఇక, ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత కేవలం పరుగులు మాత్రమే కాదు. మ్యాచ్ అనంతరం రోహిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. తన బ్యాట్‌నే సమాధానంగా నిలిపాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లు మాటలతో కాదు, ఆటతోనే సమాధానం చెబుతారనే విషయాన్ని మరోసారి నిరూపించాడు.
ఈ సెంచరీతో 2027 ప్రపంచకప్‌లో రోహిత్ స్థానం ఖాయమైందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే జాతీయ జట్టులో ఎంపికకు ఫిట్నెస్, నిలకడైన ప్రదర్శన, జట్టు అవసరాలు వంటి అంశాలు కూడా కీలకమే. అయినప్పటికీ లార్డ్స్ ఇన్నింగ్స్ సెలెక్టర్ల ఆలోచనను మళ్లీ మార్చేలా చేసింది. ఇప్పటి వరకు “రోహిత్‌ను ఎప్పుడు తప్పించాలి?” అనే ప్రశ్న వినిపిస్తే, ఇప్పుడు “ఇలాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎలా పక్కన పెడతారు?” అనే చర్చ మొదలైంది.
రోహిత్ శర్మ కెరీర్లో ఇప్పటికే ఎన్నో చారిత్రక ఇన్నింగ్స్ ఉన్నాయి. వన్డేల్లో ప్రపంచ రికార్డు 264 పరుగులు, ప్రపంచకప్‌ల్లో ఐదు సెంచరీలు, ఐసీసీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు అతని ఖాతాలో ఉన్నాయి. అయితే లార్డ్స్‌లో చేసిన ఈ 138 పరుగుల ఇన్నింగ్స్ గణాంకాల కంటే పరిస్థితుల పరంగా మరింత ప్రత్యేకంగా నిలిచింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో, వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన ఈ శతకం అతని మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.
భారత క్రికెట్లో పరివర్తన దశ కొనసాగుతున్నప్పటికీ, అనుభవం ఎంత విలువైనదో రోహిత్ మరోసారి చూపించాడు. గొప్ప ఆటగాళ్లను కేవలం వయసుతో అంచనా వేయలేమని, వారి సామర్థ్యాన్ని నిర్ణయించేది క్యాలెండర్ కాదు.. బ్యాట్ అని ఈ ఇన్నింగ్స్ స్పష్టం చేసింది. భారత్ మ్యాచ్‌లో ఓడిపోయినా, రోహిత్ శర్మ లార్డ్స్‌లో ఆడిన 138 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం చాలా కాలం పాటు క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిపోతుంది. ఇది ఒక సెంచరీ మాత్రమే కాదు.. ‘నా కథ ఇంకా ముగియలేదు’ అని ప్రపంచానికి చెప్పిన ప్రకటనగా నిలిచింది.. ఎప్పుడు అవకాశం దొరికితే రోహిత్‌పై పడిపోదాం.. పని అయిపోయిందని ప్రచారం చేద్దాం.. విమర్శలు, ఆరోపణలు చేసేద్దాం అనుకునేవారికి మాత్రం.. ఇది మింగుడు పడకపోవచ్చు.. కానీ, హిట్ మ్యాన్ సూపర్ షో మాత్రం.. నాకు ఇంకా పరుగుల దాహం తీరలేదు.. రికార్డుల వేట ఆగలేదు.. అని స్పష్టం చేస్తోంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..