Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్‌తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
జింబాబ్వే సిరీస్‌లో చోటు ఎందుకు దక్కలేదు?
జూలై 6న ప్రకటించిన జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్, అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. అయితే సంజు శాంసన్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్పందించిన బీసీసీఐ వర్గాలు, జింబాబ్వే పర్యటనలో సంజుకు తుది జట్టులో అవకాశం లభించే పరిస్థితి లేకపోవడంతో, అతడిని పర్యటనకు తీసుకెళ్లకుండా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఆసియా క్రీడల కోసం సంజు సిద్ధం
బీసీసీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లో సంజు శాంసన్ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో అతని పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి కల్పించినట్లు పేర్కొన్నారు. “అతను ఆడని సిరీస్‌కు తీసుకెళ్లడం కంటే విశ్రాంతి ఇవ్వడం మంచిదని భావించాం. అతను సీనియర్ ఆటగాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై విమర్శలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇటీవలి ప్రదర్శనపై విమర్శలు
ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐర్లాండ్ పర్యటనలో అతడు డకౌట్ కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒకే పరుగు చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శనల తర్వాత రెండో టీ20లో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జింబాబ్వే సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయకపోవడంతో, జట్టు నుంచి పూర్తిగా తొలగించారనే ప్రచారం జరిగింది.
టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన
అయితే, ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. నాకౌట్ దశలో 97 నాటౌట్, 89, 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా అందుకున్నాడు. అదేవిధంగా, ఐపీఎల్ 2026 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. మొత్తంగా.. జింబాబ్వే పర్యటనకు సంజు శాంసన్ ఎంపిక కాకపోవడం వెనుక కారణం ఫామ్ కాదని, రాబోయే కీలక టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇవ్వడమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో సంజు భవిష్యత్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్టైంది.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!